Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › MGNREGS రూ.30,50,020 నిధుల చెల్లింపులపై SSAAT సోషల్ ఆడిట్‌లో కీలక అభ్యంతరాలు
బ్రేకింగ్ న్యూస్

MGNREGS రూ.30,50,020 నిధుల చెల్లింపులపై SSAAT సోషల్ ఆడిట్‌లో కీలక అభ్యంతరాలు

08:20 ఉదయం AM

కలెక్టర్ ప్రజావాణిలో ఫిర్యాదు సమర్పించిన రామావత్ మోహన్ కృష్ణ

నల్గొండ, ఆగస్టు 24, అయుష్ 24 న్యూస్: చందంపేట మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద మొక్కల సంరక్షణ కోసం ట్యాంకర్ ద్వారా నీటిని అందించిన పనులకు సంబంధించిన చెల్లింపులపై SSAAT సోషల్ ఆడిట్‌లో పలు ఆర్థిక, విధి విధానపరమైన అభ్యంతరాలు నమోదైనట్లు ఫిర్యాదుదారు రామావత్ మోహన్ కృష్ణ తెలిపారు.

ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను నిర్ధారించి, నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రామావత్ మోహన్ కృష్ణ సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, డీపీసీకి రిప్రజెంటేషన్ సమర్పించారు.

SSAAT సోషల్ ఆడిట్‌లో నమోదైన వివరాల ప్రకారం, మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీరు అందించిన పనులకు సంబంధించిన చెల్లింపులు సంబంధిత గ్రామ పంచాయతీ MGNREGS బ్యాంక్ ఖాతాకు కాకుండా “Kinnera Traders” అనే వెండర్ ఖాతాకు చెల్లించినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో మొత్తం రూ.30,50,020 నిధుల చెల్లింపులకు సంబంధించిన రికార్డులు, బిల్లులు, వర్క్ ఆర్డర్లు, మస్టర్ రోల్స్, బ్యాంక్ లావాదేవీలు, వెండర్ వివరాలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించాలని రామావత్ మోహన్ కృష్ణ కోరారు.

సోషల్ ఆడిట్‌లో లేవనెత్తిన అభ్యంతరాలపై సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి, నిధుల చెల్లింపులు నిబంధనల ప్రకారమే జరిగాయా లేదా అనే విషయాన్ని నిర్ధారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అలాగే ప్రభుత్వ నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చర్యలు తీసుకోవాలని, విచారణలో అవకతవకలు నిర్ధారణ అయితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

అయుష్ 24 న్యూస్
నిజం మా ధ్యేయం… ప్రజలే మా బలం…

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 2🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *