Breaking News
TAIKA ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్–2026 సెప్టెంబర్ 5న హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహణ

హైదరాబాద్, జూలై 19 (ఆయుష్ 24 న్యూస్):
కరాటే క్రీడాకారులకు మరో ప్రతిష్ఠాత్మక వేదికగా నిలిచే TAIKA Open Karate Championship–2026 పోటీలు 2026 సెప్టెంబర్ 5న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

ఇటీవల నిర్వహించిన TAIKA రిఫరీ ట్రైనింగ్ సెమినార్ విజయవంతంగా ముగిసిన సందర్భంగా TAIKA గ్రాండ్‌మాస్టర్ డా. అశోక్ చక్రవర్తి మాట్లాడుతూ, సెమినార్‌లో ఎంపికైన రిఫరీలు, విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారని తెలిపారు. రాబోయే ఛాంపియన్‌షిప్‌ను మరింత నాణ్యతతో నిర్వహించేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని, కరాటే ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం పెంపొందుతాయని ఆయన అన్నారు. రిఫరీ ట్రైనింగ్‌లో పాల్గొన్న ప్రతి విద్యార్థి, కోచ్‌లు, నిర్వాహక బృంద సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

TAIKA Open Karate Championship–2026లో తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వందలాది మంది కరాటే క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. కాటా, కుమిటే విభాగాల్లో వివిధ వయో విభాగాలకు పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

పోటీల్లో పాల్గొనదలచిన అకాడమీలు, కోచ్‌లు, క్రీడాకారులు ముందస్తుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.

పోటీ వివరాలు:

  • ఈవెంట్: TAIKA Open Karate Championship–2026
  • తేదీ: 05 సెప్టెంబర్ 2026
  • వేదిక: గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, హైదరాబాద్, తెలంగాణ
  • నిర్వాహకులు: TAIKA (Traditional All India Karate Association)

– అయుష్ 24 న్యూస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *