Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › TGEJAC ఉద్యమానికి మంథనిలో ఉద్యోగుల మద్దతు వెల్లువ
బ్రేకింగ్ న్యూస్

TGEJAC ఉద్యమానికి మంథనిలో ఉద్యోగుల మద్దతు వెల్లువ

12:07 మధ్యాహ్నం PM

మంథని, ఆగస్టు 25 – అయుష్ 24 న్యూస్

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం TGEJAC రాష్ట్ర కమిటీ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంథని యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సమావేశం విజయవంతంగా జరిగింది. వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా TGEJAC పెద్దపల్లి జిల్లా చైర్మన్, జిల్లా అధ్యక్షులు బొంకూరి శంకర్ మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం అన్ని సంఘాలు ఒకే వేదికపై ఐక్యంగా నిలవడం చారిత్రాత్మకమని అన్నారు. PRC అమలు, పెండింగ్‌లో ఉన్న 6 డీఏల విడుదల, CPS రద్దు చేసి OPS పునరుద్ధరణ, హెల్త్ కార్డుల సమర్థవంతమైన అమలు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఆగస్టు 27న జిల్లా కేంద్రంలో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని, సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం, సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ మహా ధర్నాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇది ఒక్క సంఘానికి సంబంధించిన ఉద్యమం కాదని, ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు, పెన్షనర్, కార్మికుడి ఆత్మగౌరవ ఉద్యమమని అన్నారు.

TGEJAC పెద్దపల్లి జిల్లా కన్వీనర్, TGO జిల్లా అధ్యక్షులు తూము రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి న్యాయమైన హక్కులు సాధించుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మంథని డివిజన్ ఉద్యోగులు ఆగస్టు 27న జరిగే జిల్లా ధర్నాకు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ ఐక్యతను చాటాలని కోరారు.

కార్యక్రమంలో పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉద్యమ కార్యాచరణకు పూర్తి మద్దతు ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా టీఎన్జీవోల సంఘం కార్యదర్శి ఆయిరెడ్డి సందీప్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షురాలు గోపు అనిత, సౌమ్య, స్వప్న, ప్రవీణ్, శ్రీనివాస్, టీజీవో సంఘం కార్యదర్శి సురేష్, శ్రీనివాస్, రవీంద్రనాథ్, సాజిద్, మంథని యూనిట్ టీఎన్జీవో అధ్యక్షులు నూకల శంకర్, కార్యదర్శి పవన్, డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి సంతోష్ రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు గండు కృష్ణమూర్తి, మంథని యూనిట్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

సమావేశం ముగింపులో ఉద్యోగులందరూ ఐక్యంగా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ప్రతిజ్ఞ చేశారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 3🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *