పాలపాటి తండాలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకొండ ఎమ్మెల్యే
ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్ష
దేవరకొండ నియోజకవర్గం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని ప్రార్థన
పీఏ పల్లి, నవంబర్ 6, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, తుల్జా భవాని అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆకాంక్షించారు.
పీఏ పల్లి మండలంలోని బాలాజీనగర్ గ్రామ పరిధిలోని పాలపాటి తండాలో నిర్వహించిన శ్రీ తుల్జా భవాని అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నియోజకవర్గం సుభిక్షంగా అభివృద్ధి చెందాలి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ తుల్జా భవాని అమ్మవారి అనుగ్రహంతో దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.
నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, సుఖసంతోషాలు కలగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో నెర్మటి సతీష్ రెడ్డి, కుక్కల గోవర్ధన్ రెడ్డి, వీరబోయిన ఎల్లయ్య యాదవ్, పాల్వాయి వెంకట్ రెడ్డి, మేగావత్ కిషన్ నాయక్, వంగాల శ్రీనివాస్ రెడ్డి, నేనావత్ లక్షణ్ నాయక్, రామావత్ దస్రు నాయక్, మెగావత్ రాజు, మెగావత్ బన్సీలాల్, మెగావత్ సంగు, మెగావత్ శ్రీరామ్ నాయక్, కొర్ర బాలకృష్ణ చౌహన్, రామావత్ జగన్ నాయక్, రామావత్ రవి నాయక్, రామావత్ రాజా నాయక్, రామావత్ భగవాన్ నాయక్, ఆంగోతు బోడా నాయక్, ఏకుల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
వీరితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.











Leave a Reply