హైదరాబాద్, సెప్టెంబర్ 21 (ప్రతినిధి):
హైదరాబాద్ నగర పరిధిలో పూర్తయిన 21 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి తదితర జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఇళ్ల కేటాయింపు ప్రక్రియపై మంత్రి సమీక్షించారు.
క్యూర్ పరిధిలోని 26 ప్రాంతాల్లో గతంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా లక్కీ డ్రా విధానంలో చేపట్టాలని, ఎంపికైన వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
ఇళ్ల సముదాయాలకు 5 నుంచి 7 కిలోమీటర్ల పరిధిలో నివసించే అర్హులైన పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. అలాగే కొత్తగా కేటాయించే కాలనీల్లో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్న అనర్హులను గుర్తించి, కేటాయించిన ఇళ్లలో నివసించని వారికి నోటీసులు జారీ చేసి, నిబంధనల ప్రకారం కేటాయింపులను రద్దు చేసి అర్హులకు అవకాశం కల్పించాలని మంత్రి ఆదేశించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
కాగా, క్యూర్ పరిధిలో ఇంటి స్థలం ఉన్న అర్హులైన సుమారు 9 వేల మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసే అంశాన్ని కూడా మంత్రి ప్రస్తావించినట్లు సమాచారం.










Leave a Reply