జగిత్యాల, అక్టోబర్ 14 (Ayush 24 News): ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకోవాలని, నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని ఆయన తెలిపారు.
జగిత్యాల జిల్లా పొలాస గ్రామంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కళాశాలలో వ్యవసాయ శాఖ, ఆత్మ (ATMA) ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళా కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులు తక్కువ నీటితో సాగు చేసుకునే ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకునే పంటల సాగుపై దృష్టి సారించాలని, వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తూ సాగు చేపట్టాలని కోరారు.
రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం, వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల సాగులో తగిన జాగ్రత్తలు తీసుకునేలా ప్రోత్సహించడం కిసాన్ మేళాల ప్రధాన ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసుకొని వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకోవడం ద్వారా పంట నష్టాలను తగ్గించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం పలువురు రైతులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
— Ayush 24 News
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం.. రైతులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల, అక్టోబర్ 14 (Ayush 24 News): ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకోవాలని, నీటి లభ్యతను


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply