ఓపెన్ కుమితే గ్రాండ్ ఛాంపియన్గా హాసినిమాస్టర్ అనిల్ యాదవ్ శిక్షణలో ఘన విజయం
రెండవ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్షిప్లో లక్ష్యం షోటోకాన్ కరాటే అకాడమీ విద్యార్థిని సత్తా చాటింది
మద్ది కనాన్ గౌడ్ ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్
హైదరాబాద్, చంపాపేట్: హైదరాబాద్లోని లక్ష్మీ గార్డెన్లో నిర్వహించిన రెండవ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్షిప్లో లక్ష్యం షోటోకాన్ కరాటే అకాడమీకి చెందిన విద్యార్థిని హాసిని అనిల్ యాదవ్ ఓపెన్ కుమితే విభాగంలో గ్రాండ్ ఛాంపియన్ టైటిల్ను కైవసం చేసుకుని అద్భుత ప్రతిభను చాటారు.

గురువు మార్గదర్శకత్వంలో నిరంతర సాధనతో పోటీల్లో పాల్గొన్న హాసిని అనిల్ యాదవ్ అత్యుత్తమ ప్రదర్శనతో విజేతగా నిలిచి అకాడమీకి, తన గురువుకు మంచి పేరు తీసుకువచ్చారు. ఆమె విజయంపై అకాడమీ సభ్యులు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.వివిధ జిల్లాల నుంచి మాస్టర్లు, కోచ్లు, క్రీడాకారులు పాల్గొని పోటీలకు ప్రత్యేక ఆకర్షణ
ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ను మద్ది కనాన్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన కరాటే మాస్టర్లు, కోచ్లు, రిఫరీలు మరియు వందలాది మంది క్రీడాకారులు హాజరై పోటీలను విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా విజేతలకు ట్రోఫీలు, పతకాలు అందజేసి అభినందించారు. హాసిని అనిల్ యాదవ్ భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించాలని పలువురు ఆకాంక్షించారు. అయుష్ 24 న్యూస్ తరఫున హాసిని అనిల్ యాదవ్కు హృదయపూర్వక అభినందనలు.

