కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట చంద్రయ్యను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
కరీంనగర్, సెప్టెంబర్ 21 (ప్రతినిధి): కరీంనగర్లోని అపోలో రీచ్ హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రయ్యను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు.
ఈ సందర్భంగా చంద్రయ్య ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.

చంద్రయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి శ్రీధర్ బాబు.. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఆయనకు, ఆయన కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు.










Leave a Reply