దేవరకొండ: దేవరకొండ మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పిరాటి ఆంజనేయులు గౌడ్ మృతి చెందడంతో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మంగళవారం ఆయన స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆంజనేయులు గౌడ్ భౌతికకాయానికి పూలమాల వేసి, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. పిరాటి ఆంజనేయులు గౌడ్ కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతతో పనిచేసిన సీనియర్ నాయకుడని అన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించారని గుర్తుచేశారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి, గొట్టిముక్కల గ్రామానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంజనేయులు గౌడ్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే బాలు నాయక్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మారుపాకుల సురేష్ గౌడ్, గ్రామ సర్పంచ్ ఎరుకల పార్వతి వెంకటేష్, కడారి అయ్యన్న, జటావత్ లక్ష్మిపతి, కిన్నెర హరికృష్ణ, ముకురోజు రాజు, ఎరుకల వెంకటయ్య, దేపా జగత్ రెడ్డి, ఈదుల నర్సిరెడ్డి, దేపా మధుసూదన్ రెడ్డి, యెషమోని మల్లేష్, జరుపుల రతన్, చాట్ల శ్రీను తదితర గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Ayush 24 News – The Voice of Truth
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పిరాటి ఆంజనేయులు గౌడ్ మృతికి ఎమ్మెల్యే బాలు నాయక్ నివాళి
దేవరకొండ: దేవరకొండ మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పిరాటి ఆంజనేయులు గౌడ్ మృతి చెందడంతో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మంగళవారం ఆయన స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆంజనేయులు గౌడ్ భౌతికకాయానికి పూలమాల వేసి, కాంగ్రెస్ పార్టీ


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply