నల్గొండ: మహబూబ్‌నగర్–నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో పోరాడి సాధించుకున్న నేపథ్యంలో ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూడాలని సూచించారు.
పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని కోరారు. ఎదుళ్ల రిజర్వాయర్ నీటి కేటాయింపులపై రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు సామరస్యపూర్వకంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ఈ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
🟥 AYUSH 24 NEWS ప్రజల కోసం.. ప్రజా సమస్యలపై నిరంతరం.
జల వివాదాలకు తావివ్వొద్దు.. రెండు జిల్లాల మధ్య సామరస్యమే ముఖ్యం: గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్గొండ: మహబూబ్‌నగర్–నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించడం సరికాదని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో పోరాడి సాధించుకున్న నేపథ్యంలో ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూడాలని సూచించారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply