Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ
Home › బ్రేకింగ్ న్యూస్ › తుపాకీ మిస్‌ఫైర్‌.. రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి
బ్రేకింగ్ న్యూస్

తుపాకీ మిస్‌ఫైర్‌.. రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి

11:25 ఉదయం AM

నిజామాబాద్, సెప్టెంబర్ 18 (ప్రతినిధి): నిజామాబాద్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ హెచ్. సతీష్ మృతి చెందారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఘటన చోటుచేసుకుంది.

శుక్రవారం తెల్లవారుజామున విధులు ముగించుకుని హెడ్‌క్వార్టర్స్‌కు తిరిగి వచ్చిన సతీష్.. అనంతరం తన ఆయుధాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఆర్‌ఐ సతీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపడుతున్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 29🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App