హైదరాబాద్, సెప్టెంబర్ 24:
తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులుగా వంగూరి పాపన్న గౌడ్ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం కేంద్ర కార్యాలయంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గట్టు రామచంద్రయ్య గౌడ్ చేతుల మీదుగా పాపన్న గౌడ్ నియామక పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా పాపన్న గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ గౌడ జాతి అభ్యున్నతి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. గౌడ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
అలాగే గౌడ యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, సామాజికంగా మరియు ఆర్థికంగా గౌడ సమాజం అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని పాపన్న గౌడ్ తెలిపారు.
తనకు జిల్లా ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించిన తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గట్టు రామచంద్రయ్య గౌడ్, రాష్ట్ర అధ్యక్షులు గుండాల మల్లేష్‌కు పాపన్న గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
— Ayush 24 News
The Voice of Truth
తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులుగా వంగూరి పాపన్న గౌడ్ నియామకం
హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులుగా వంగూరి పాపన్న గౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం కేంద్ర కార్యాలయంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గట్టు రామచంద్రయ్య గౌడ్ చేతుల మీదుగా పాపన్న గౌడ్ నియామక


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply