దేవరకొండ: తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు నామని సత్యనారాయణకు దేవరకొండ పట్టణంలో నిర్వహించిన దశదిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ నివాళులర్పించారు. సాయిశివ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే.. నామని సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
చోళ్ళేటి భాస్కరాచారి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
దేవరకొండ పట్టణంలోని 16వ వార్డుకు చెందిన మాజీ స్వర్ణకారి సంఘం అధ్యక్షుడు చోళ్ళేటి భాస్కరాచారి మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ వారి నివాసానికి వెళ్లారు. భాస్కరాచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పాతనబోయిన భారతమ్మ కుటుంబానికి ఎమ్మెల్యే బాలు నాయక్ పరామర్శ
దేవరకొండ పట్టణంలోని 14వ వార్డుకు చెందిన పాతనబోయిన భారతమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమాల్లో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు పున్న వెంకటేశ్వర్లు, ముక్కమల్ల వెంకటయ్య గౌడ్, దొండేటి మల్లారెడ్డి, సన్నాయిల ఉమామహేశ్వర్ యాదవ్, ఆయా వార్డుల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Ayush 24 News – The Voice of Truth
తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు నామని సత్యనారాయణకు ఎమ్మెల్యే బాలు నాయక్ నివాళులు
దేవరకొండ: తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు నామని సత్యనారాయణకు దేవరకొండ పట్టణంలో నిర్వహించిన దశదిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ నివాళులర్పించారు. సాయిశివ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే.. నామని సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. చోళ్ళేటి


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply