కిరాణా జనరల్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
దేవరకొండ, సెప్టెంబర్ 23 (ప్రతినిధి):
దేవరకొండ పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా బుధవారం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. పట్టణంలోని 20 వార్డుల్లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలు నిమజ్జన శోభాయాత్రలో భాగంగా గాంధీ బజార్‌కు చేరుకుంటున్న నేపథ్యంలో కిరాణా జనరల్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
నిమజ్జన శోభాయాత్రల్లో పాల్గొంటున్న భక్తులకు అసోసియేషన్ ప్రతినిధులు ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు నీల బుచ్చయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనే భక్తులకు సేవ చేయడం ఆనందంగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కర్నాటి గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి కుంచకూరి లక్ష్మణ్, కోశాధికారి నేలాంటి రమేష్, కమిటీ సభ్యులు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply