మైనంపల్లి, అక్టోబర్ 26, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
నీరు, విద్యుత్‌ను ప్రతి ఒక్కరూ పొదుపుగా వినియోగించుకోవాలని మైనంపల్లి గ్రామ సర్పంచ్ రాంసింగ్ నాయక్ కోరారు. సోమవారం మైనంపల్లి గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన ఎల్‌నినో ప్రభావం, నివారణ చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రామ పాలకవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రాంసింగ్ నాయక్ మాట్లాడుతూ, నీటి వనరులను సంరక్షించుకోవడంతో పాటు విద్యుత్‌ను అవసరానికి అనుగుణంగా వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని గ్రామ ప్రజలను కోరారు.
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి వినియోగం, విద్యుత్ పొదుపు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నీరు, విద్యుత్ సంరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ఈ సమావేశంలో ఉప సర్పంచ్ లాలూ నాయక్, వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) అభిలాష్, పంచాయతీ కార్యదర్శి అంబేద్కర్, వార్డు సభ్యుడు నాగరాజు, మాజీ ఉప సర్పంచ్ వెంకట్, ఫీల్డ్ అసిస్టెంట్ అమరెందర్, ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు కమలమ్మ, లచ్చి, బుజ్జి, ఏఎన్ఎం విద్యావతి తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply