ఉదయం 11 గంటలకు లద్మాపూర్, పుట్టపాక ప్రాంతాల్లో బాలవికాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నవంబర్ 1న గణపతి సచ్చిదానంద సరస్వతి మంథనికి రానున్న నేపథ్యంలో హెలిప్యాడ్తో పాటు సంబంధిత ఏర్పాట్లను పరిశీలించనున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు ఖానాపూర్లో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని, బాలవికాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఖాన్సాయిపేట సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
అనంతరం సాయంత్రం 4 గంటలకు నవంబర్ 1న గణపతి సచ్చిదానంద సరస్వతి ధన్వాడకు రానున్న నేపథ్యంలో అక్కడి హెలిప్యాడ్, ఇతర ఏర్పాట్లను మంత్రి పరిశీలించనున్నారు.
ఈ మేరకు మంత్రి వ్యక్తిగత సహాయకుడు ఏ. చంద్రశేఖర్ పర్యటన కార్యక్రమ వివరాలను వెల్లడించారు.
నేడు మంథని నియోజకవర్గంలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పర్యటన
27అక్టోబర్2026
04:15 తెల్లవారుజాము AM
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.

AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply