Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › రాజకీయాలు › మంథనిలో అంగన్వాడీ టీచర్, ఆయాకు బీజేపీ సన్మానం
రాజకీయాలు

మంథనిలో అంగన్వాడీ టీచర్, ఆయాకు బీజేపీ సన్మానం

01:03 మధ్యాహ్నం PM

సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా శాలువా, పూలమాలతో సత్కారం

AYUSH24 News ప్రతినిధి

మంథని: సెప్టెంబర్ 29

బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంథని పట్టణంలోని బోయిన్‌పేట 6వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్, ఆయాను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.

మంథని పట్టణ బీజేపీ అధ్యక్షుడు సబ్బని సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ శ్రీపెరంబదూర్ జావ హరి కుమారిని పట్టణ కార్యదర్శి దూడపాక రోజా, అంగన్వాడీ ఆయాను పట్టణ ప్రధాన కార్యదర్శి ఎడ్ల సాగర్ సతీమణి ఎడ్ల మౌనిక శాలువా, పూలమాలతో సత్కరించారు.

చిన్నారులకు విద్యాబోధన చేయడంతో పాటు వారి ఎదుగుదలను పర్యవేక్షించడం, పౌష్టికాహారం అందించడం, గర్భిణులకు అవసరమైన సూచనలు చేయడం, ఏఎన్ఎంలతో కలిసి ఇమ్యునైజేషన్ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం వంటి సేవలను అంగన్వాడీ సిబ్బంది అందిస్తున్నారని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. వారి సేవలను గుర్తిస్తూ ఈ సన్మానం నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బోగోజు శ్రీనివాస్, పట్టణ మాజీ అధ్యక్షుడు బూడిద తిరుపతి, సీనియర్ నాయకులు రాపర్తి సంతోష్, నారమల్ల కృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎడ్ల సాగర్, సామల అశోక్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు గుడ్ల గురువేష్, పట్టణ కార్యదర్శి పార్వతి విష్ణు, రమేష్, శ్రీకాంత్‌తో పాటు మహిళలు, అంగన్వాడీ చిన్నారులు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అయుష్ 24 న్యూస్ — The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 96🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App