భక్తిశ్రద్ధలతో సాగిన శోభాయాత్ర.. యువత నృత్యాలతో సందడి
దేవరకొండ, సెప్టెంబర్ 23 (ప్రతినిధి):
దేవరకొండ మండలంలోని ముదిగొండ గ్రామంలో శ్రీ దుర్గామాత గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
నిమజ్జనానికి ముందు గణనాథుడికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు భజనలు చేస్తూ గ్రామ వీధుల గుండా వినాయకుడి శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు.
“జై బోలో గణేష్ మహారాజ్” అంటూ యువత చేసిన నినాదాలతో గ్రామ వీధులు మార్మోగాయి. యువత నృత్యాలు, భక్తుల భజనల నడుమ నిమజ్జన శోభాయాత్ర ఉత్సాహభరితంగా సాగింది.
ఈ నిమజ్జన కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు, యువత, మహిళలు, శ్రీ దుర్గామాత గణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply