మెదక్, సెప్టెంబర్ 17: కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ సెప్టెంబర్ 18న మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు మెదక్‌కు చేరుకోనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
పర్యటనలో భాగంగా పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చడంతో పాటు ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు.
పర్యటన వివరాలు
ఉదయం 11:15 గంటలకు:
మెదక్ పట్టణంలోని దయారా వీధికి చెందిన గొల్ల సిద్ధరాములు చెరువులో పడి మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించనున్నారు.
ఉదయం 11:45 గంటలకు:
హవేలీ ఘన్పూర్ మండలం కుచన్‌పల్లి గ్రామానికి చెందిన ఎరుకల ఎంకమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించనున్నారు.
మధ్యాహ్నం 12:15 గంటలకు:
హవేలీ ఘన్పూర్ మండల కేంద్రానికి చెందిన ఎర్ర రామయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించనున్నారు.
ఈ పర్యటనకు సంబంధించి పత్రికా విలేకరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీలా గ్రూప్ సభ్యులు, MN యువసేన సభ్యులు కార్యక్రమ వివరాలను గమనించాలని నిర్వాహకులు కోరారు.
— ఆయుష్ 24 న్యూస్ ప్రతినిధి










Leave a Reply