ఆయుష్ 24 న్యూస్ | చింతపల్లి, అక్టోబర్ 11:
రైతులకు ఎల్నినో ప్రభావం నుంచి పంటలను కాపాడుకోవడం, కరువు పరిస్థితులను ఎదుర్కొనే చర్యలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం, అక్టోబర్ 12న ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పంటల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కరువు పరిస్థితులను తట్టుకునే విధానాలు, పంటల సాగు ప్రణాళిక తదితర కీలక అంశాలపై ముఖ్యమంత్రి రైతులకు సూచనలు అందించనున్నారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడి వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. చింతపల్లి మండలంలోని చింతపల్లి, మదనాపురం రైతు వేదికల్లో కార్యక్రమాన్ని వీక్షించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
కావున మండలంలోని రైతులతో పాటు గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరై ముఖ్యమంత్రి సందేశాన్ని వీక్షించాలని, పంటల రక్షణకు సంబంధించిన వ్యవసాయ సూచనలను తెలుసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు.
ఇట్లు, వ్యవసాయ శాఖ, చింతపల్లి మండలం.
ఆయుష్ 24 న్యూస్ The Voice of Truth
రైతులకు ముఖ్య సమాచారం ఎల్నినో ప్రభావం.. పంటల రక్షణపై సీఎం వీడియో కాన్ఫరెన్స్
ఆయుష్ 24 న్యూస్ | చింతపల్లి, అక్టోబర్ 11: రైతులకు ఎల్నినో ప్రభావం నుంచి పంటలను కాపాడుకోవడం, కరువు పరిస్థితులను ఎదుర్కొనే చర్యలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం, అక్టోబర్ 12న ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply