160 మందికి పరీక్షలు, మందుల పంపిణీ — 15 మంది కంటి శస్త్రచికిత్సకు ఎంపిక
దేవరకొండ, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
మానవసేవే మాధవసేవ అనే స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయడమే లయన్స్ క్లబ్ ప్రధాన లక్ష్యమని, ప్రతి ఒక్కరూ క్లబ్ అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ అధ్యక్షుడు గుద్దేటి జంగయ్య అన్నారు.
లయన్స్ క్లబ్ కోశాధికారి చిలుకూరి కాశీనాథ్ కుమారులు చిలుకూరి కార్తికేయ, విశ్వవర్ధన్ ఆర్థిక సహకారంతో శుక్రవారం దేవరకొండ పట్టణంలోని ఖిల్లా బజార్ ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో ఉచిత కంటి, షుగర్, బీపీ వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ శిబిరంలో 160 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. వీరిలో 15 మందిని కంటి శస్త్రచికిత్సకు గుర్తించామని, వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు గుద్దేటి జంగయ్య తెలిపారు.
కాలనీవాసులు లయన్స్ క్లబ్ సేవలను అభినందించారు. తమ కాలనీలో గతంలో ఇతరులు ఇలాంటి శిబిరాలు నిర్వహించలేదని, లయన్స్ క్లబ్ ప్రతి సంవత్సరం వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు కంటి సమస్యలతో బాధపడుతున్న పేదలకు ఉచిత పరీక్షలు, శస్త్రచికిత్సలు చేయించడం అభినందనీయమని పేర్కొంటూ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గుద్దేటి జంగయ్య, ప్రధాన కార్యదర్శి కాశిరెడ్డి రవీందర్ రెడ్డి, కోశాధికారి చిలుకూరి కాశీనాథ్, జోన్ చైర్పర్సన్ గాజుల ఉషారాణి, వనం శ్రీనివాసులు, వస్కుల సత్యనారాయణ, చీదెళ్ళ వెంకటేశ్వర్లు, లకుమారపు మల్లయ్య, డాక్టర్ పి.జె. సామ్సన్, ఆవులూరి వెంకటేశ్వరరావు, అలుగుబెల్లి జయపాల్ రెడ్డి, జల్ల భాస్కర్, బొడ్డుపల్లి భీష్మాచారి, దినేష్, ఆప్తమాలిస్ట్ హరి తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply