Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు
Home › సామాజిక సేవ › వృద్ధ మహిళల ఆశ్రమానికి 25 లీటర్ల గీజర్ బహూకరణ
సామాజిక సేవ

వృద్ధ మహిళల ఆశ్రమానికి 25 లీటర్ల గీజర్ బహూకరణ

08:15 ఉదయం AM

దేవరకొండ, అక్టోబర్ 26, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

వృద్ధులను ఆదరించి, వారికి అండగా నిలవాలని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ అధ్యక్షుడు గుద్దేటి జంగయ్య పిలుపునిచ్చారు. లయన్ కర్నాటి పురుషోత్తం–రాజ్యలక్ష్మి దంపతులు తమ కుమార్తె తన్మయి జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం దేవరకొండ పట్టణంలోని మహాలక్ష్మి మహిళా వృద్ధాశ్రమానికి 25 లీటర్ల గీజర్‌ను బహూకరించారు.

ఈ సందర్భంగా గుద్దేటి జంగయ్య మాట్లాడుతూ, తన్మయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన వేడుకలను నాలుగు గోడల మధ్య జరుపుకోవడానికే పరిమితం కాకుండా, వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సేవా దృక్పథానికి నిదర్శనంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

వృద్ధుల అవసరాలను గుర్తించి వారికి ఉపయోగపడే వస్తువులను అందించడం గొప్ప విషయమని, ఆశ్రమానికి అందజేసిన గీజర్ వృద్ధ మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా కర్నాటి పురుషోత్తం–రాజ్యలక్ష్మి దంపతులను లయన్స్ క్లబ్ సభ్యులు శాలువాతో సన్మానించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కాశిరెడ్డి రవీందర్ రెడ్డి, కోశాధికారి చిలుకూరి కాశీనాథ్, జోన్ చైర్మన్ గాజుల ఉషారాణి, గాజుల రాజేష్, వనం శ్రీనివాసులు, జల్లా భాస్కర్, దినేష్, వృద్ధాశ్రమ అధ్యక్షురాలు గాజుల యాదమ్మ, సముద్రాల జయ ప్రభాకర్, గుడుగుంట్ల హేమలత, గోవిందు జగతయ్య, పద్మజ, మేనేజర్ పగిడిమర్రి జానకి, ఆశ్రమంలోని మహిళలు తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 87🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
219 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App