Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › వినాయకుడి లడ్డూ వేలంలో విజేతలకు ఎమ్మెల్యే బాలు నాయక్ అభినందనలు
బ్రేకింగ్ న్యూస్

వినాయకుడి లడ్డూ వేలంలో విజేతలకు ఎమ్మెల్యే బాలు నాయక్ అభినందనలు

రూ.1.25 లక్షలకు లడ్డూ దక్కించుకున్న మహాలక్ష్మయ్య–నాగమణి దంపతులు రూ.50,116లకు పెద్ద లడ్డూ గెలుచుకున్న కౌన్సిలర్ హనుమంతు సాయి చంద్ర వినాయక పూజల్లో పాల్గొని నియోజకవర్గ ప్రజల యోగక్షేమాలు కోరుకున్న ఎమ్మెల్యే దేవరకొండ, సెప్టెంబర్ 23: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా దేవరకొండ పట్టణంలో నిర్వహించిన వివిధ గణేష్ ఉత్సవ

11:20 ఉదయం AM

రూ.1.25 లక్షలకు లడ్డూ దక్కించుకున్న మహాలక్ష్మయ్య–నాగమణి దంపతులు
రూ.50,116లకు పెద్ద లడ్డూ గెలుచుకున్న కౌన్సిలర్ హనుమంతు సాయి చంద్ర
వినాయక పూజల్లో పాల్గొని నియోజకవర్గ ప్రజల యోగక్షేమాలు కోరుకున్న ఎమ్మెల్యే
దేవరకొండ, సెప్టెంబర్ 23:
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా దేవరకొండ పట్టణంలో నిర్వహించిన వివిధ గణేష్ ఉత్సవ కార్యక్రమాల్లో దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడి లడ్డూ వేలం, లక్కీ డ్రా కార్యక్రమాల్లో విజేతలుగా నిలిచిన వారిని ఎమ్మెల్యే అభినందించారు.
రూ.1,25,116లకు లడ్డూ వేలం
దేవరకొండ పట్టణంలోని 7వ వార్డు ఎంకేఆర్ నగర్‌లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలం పాటలో రూ.1,25,116లకు తెల్దేవర్‌పల్లి మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు బొద్దికూర మహాలక్ష్మయ్య–నాగమణి దంపతులు లడ్డూను దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గణేష్ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రూ.50,116లకు పెద్ద లడ్డూ.. కౌన్సిలర్ సొంతం
అనంతరం ఎల్‌ఐసీ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన పెద్ద లడ్డూ వేలం పాటలో రూ.50,116లకు 7వ వార్డు కౌన్సిలర్ హనుమంతు సాయి చంద్ర గౌడ్ లడ్డూను దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ సాయి చంద్రను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ నిర్వహించిన చిన్న లడ్డూ లక్కీ డ్రా కార్యక్రమంలో విజేతగా నిలిచిన రంగులాల్ రక్షితను కూడా ఎమ్మెల్యే అభినందించారు.
మార్కెట్ యార్డ్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవం
అనంతరం దేవరకొండ మార్కెట్ యార్డ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు.
ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ..
“విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి. ప్రతి కుటుంబంలో ఆనందం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలి. రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలి. ప్రజలందరి యోగక్షేమాలు బాగుండాలని గణనాథుడిని ప్రార్థిస్తున్నాను” అని అన్నారు.
వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులు, యువత, భక్తులను ఎమ్మెల్యే అభినందించారు. భక్తి భావంతో పాటు ఐక్యత, సోదరభావంతో పండుగను నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మారుపాకుల సురేష్ గౌడ్, హనుమంతు వెంకటేష్ గౌడ్, హనుమంతు సాయి చంద్ర గౌడ్, కిన్నెర హరికృష్ణ, సోమాని నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
— Ayush 24 News

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 100🔗 Shares: 5👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App