హైదరాబాద్, అక్టోబర్ 15 (ఆయుష్ 24 న్యూస్): అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ నూతన నియామకాల్లో భాగంగా దేవరకొండ పట్టణానికి చెందిన లయన్ సముద్రాల ధనంజయ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులయ్యారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన నియామకాన్ని ప్రకటించి, నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ‘మరణించినా జీవించండి’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా శరీరదానం, అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మరణానంతరం శరీరాన్ని వైద్య విద్య, పరిశోధనల కోసం దానం చేయడంతో పాటు, అవయవదానం ద్వారా మరెందరికో ప్రాణదానం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అఖిల భారత శరీర అవయవ దాతల సంఘాన్ని స్థాపించి దేశవ్యాప్తంగా మానవీయ విలువలతో కూడిన అవయవదాన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు వివరించారు. ఈ ఉద్యమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, శరీరదానం, అవయవదానంపై అపోహలను తొలగించి, ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో నూతన కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులైన లయన్ సముద్రాల ధనంజయ భవిష్యత్తులో అవయవదాన ఉద్యమ విస్తరణకు కృషి చేస్తారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. అవయవదానంపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు సంఘం చేపట్టే కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సంఘం చీఫ్ మెంటర్ డాక్టర్ ఎస్. విజయ్ కుమార్, చైర్పర్సన్ డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి, మేనేజింగ్ ట్రస్టీ ప్రొఫెసర్ ఆనంద్ స్వరూప్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
ఆయుష్ 24 న్యూస్
శరీర అవయవ దాతల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా లయన్ సముద్రాల ధనంజయ ఎన్నిక
హైదరాబాద్, అక్టోబర్ 15 (ఆయుష్ 24 న్యూస్): అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ నూతన నియామకాల్లో భాగంగా దేవరకొండ పట్టణానికి చెందిన లయన్ సముద్రాల ధనంజయ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులయ్యారు. గురువారం హైదరాబాద్‌లో


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply