12వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానం
నూతన సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ థియాన్ మావికి శుభాకాంక్షలు
దేవరకొండ, అక్టోబర్ 26, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
దేవరకొండ నూతన సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన **కరోలిన్ చింగ్ థియాన్ మావి**ని మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), దేవరకొండ ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామావత్ రవి ఆధ్వర్యంలో అధ్యాపక బృందం సబ్ కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కళాశాలలో త్వరలో నిర్వహించనున్న 12వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ థియాన్ మావి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జి. కోటయ్య, అకాడమిక్ కోఆర్డినేటర్ సి. లింగమయ్య, ఎన్సీసీ అధికారి ఆర్. నాగేంద్ర, అధ్యాపకుడు మధు తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply