దశలవారీగా దేవరకొండ పట్టణంలోని అన్ని రోడ్లు పూర్తి చేస్తాం
దేవరకొండ, సెప్టెంబర్ 21 (ప్రతినిధి):
దేవరకొండ పట్టణంలో దశలవారీగా ప్రధాన రహదారులతో పాటు అన్ని వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు అన్నారు.
సోమవారం పట్టణంలోని చేనేత సహకార సంఘం భవనం సమీపంలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను ఆమె పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిపై మున్సిపల్ ఏఈ రాజును వివరాలు అడిగి తెలుసుకుని, పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పట్టణ పరిసరాల పరిశుభ్రతకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమైన పనులను దశలవారీగా చేపడుతున్నామని చెప్పారు.

చేనేత సహకార సంఘం చైర్మన్ చేరుపల్లి బాలరాజు ఆహ్వానం మేరకు చేనేత సహకార సంఘం భవనం ఆవరణ పరిసరాల్లో జరుగుతున్న రోడ్డు పనులను చైర్పర్సన్ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు, చేనేత సహకార సంఘం డైరెక్టర్లు, మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply