దేవరకొండ, ఆయుష్ 24 న్యూస్:
అనారోగ్యంతో బ్రాహ్మణపల్లిలోని తన అల్లుడి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న నేనావత్ హన్మానాయక్ను ఆదివారం ఆయన మిత్రబృందం కలిసి పరామర్శించింది. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని, క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనకు ధైర్యం చెబుతూ మనోధైర్యాన్ని నింపారు. కుటుంబ సభ్యులను సైతం ఆప్యాయంగా పలకరించి ధైర్యం చెప్పారు.
గతంలో దేవరకొండ ఎల్ఐసీ బ్రాంచీలో సీనియర్ బ్రాంచ్ మేనేజర్‌గా సేవలందించిన ఎస్. రామూ చౌహాన్‌తో పాటు ఏనుగుంటి ఎల్లయ్య, రామావత్ ఠాకూర్, నేనావత్ రంగానాయక్, నారమోని మల్లేశ్ యాదవ్, సపావత్ చిన్నా నాయక్, వాంకనావత్ ఖండియా నాయక్ తదితరులు ఈ పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్. రామూ చౌహాన్ మాట్లాడుతూ.. భగవంతుని కృపతో, తమ తాత ఆశీస్సులతో నేనావత్ హన్మానాయక్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
— ఆయుష్ 24 న్యూస్
The Voice of Truth
అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న నేనావత్ హన్మానాయక్ను పరామర్శించిన మిత్రబృందం
దేవరకొండ, ఆయుష్ 24 న్యూస్: అనారోగ్యంతో బ్రాహ్మణపల్లిలోని తన అల్లుడి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న నేనావత్ హన్మానాయక్ను ఆదివారం ఆయన మిత్రబృందం కలిసి పరామర్శించింది. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని, క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనకు ధైర్యం చెబుతూ మనోధైర్యాన్ని నింపారు.


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply