మంచిర్యాల జిల్లాలోని 18 మండలాల నుంచి హాజరైన మార్షల్ ఆర్ట్స్ మాస్టర్లు
మంచిర్యాల, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
మంచిర్యాలలోని ఎస్ఆర్ డీజీ స్కూల్లో శుక్రవారం అమేచూర్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లాలోని 18 మండలాలకు చెందిన వివిధ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ల సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
అసోసియేషన్ చైర్మన్గా రాయమల్లు, ప్రెసిడెంట్గా జుల్ఫిగర్ హైమద్, గౌరవ అధ్యక్షుడిగా ఎడ్ల నారాయణ, వైస్ ప్రెసిడెంట్గా రంగం రమేష్, ప్రధాన కార్యదర్శిగా మోకినపల్లి సరేష్ ఎన్నికయ్యారు.
సహాయ కార్యదర్శులుగా ఈ. వెంకటేష్, ఎల్. నారాయణ, కే. రవి, ఎస్. చెందు వినయ్ ఎన్నికయ్యారు. ఈసీ మెంబర్లుగా కరుణాకర్, ఎల్. శ్రీకాంత్, సంపత్, సిద్ది సాయి, నరేష్, శశి ఎన్నికయ్యారు.
మహిళా కమిషన్ చైర్మన్గా భారతి, అధ్యక్షురాలిగా గీతాదేవి, ప్రధాన కార్యదర్శిగా శిరీష, సహాయ కార్యదర్శులుగా మౌనిక, ప్రవళిక, జోష్ణ ఎన్నికయ్యారు. కమిటీ సలహాదారులుగా కృష్ణ ప్రసాద్, రామ్మోహన్, జితేందర్, రామకృష్ణ ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికలకు పరిశీలకులుగా సీనియర్ కరాటే మాస్టర్ ఎడ్ల నారాయణ, విజిగిరి రవి వ్యవహరించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సమావేశానికి హాజరైన మార్షల్ ఆర్ట్స్ మాస్టర్లు అభినందించారు.










Leave a Reply