నేరడుగొమ్ము ,30అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ):
నేరడుగొమ్ము మండల విద్యాశాఖలో మండల విద్యాధికారి తాటికొండ బ్రహ్మచారి,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తుల శ్రీనివాస్‌పై ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మండల ఉపాధ్యాయ వర్గాలు ఐక్యంగా స్పందించాయి.ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ వారిద్దరికీ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.మండలంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఏకగ్రీవంగా తీర్మానం చేయగా, అన్ని ఉపాధ్యాయ సంఘాలు సైతం తమ మద్దతును ప్రకటించడం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.సన్మానం సమిష్టి నిర్ణయం..వ్యక్తిగత బాధ్యత కాదు!మండల విద్యాధికారి తాటికొండ బ్రహ్మచారి పదవీ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించాలనే నిర్ణయం మండలంలోని ప్రధానోపాధ్యాయులందరి సమిష్టి అభిప్రాయంతో తీసుకున్నదని ఐక్య ప్రకటనలో స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం నిర్వహణ విషయంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తుల శ్రీనివాస్‌కు వ్యక్తిగత బాధ్యతను ఆపాదించడం సరికాదన్నారు. ఎవరినీ బలవంతంగా డబ్బులు ఇవ్వాలని కోరలేదని, ప్రధానోపాధ్యాయులపై ఎలాంటి ఒత్తిడి చేయలేదని పేర్కొన్నారు.అందరి సమష్టి నిర్ణయాన్ని వక్రీకరించి వ్యక్తులపై ఆరోపణలు చేయడాన్ని ఖండించారు.35 ఏళ్ల విద్యాసేవకు సముచిత గౌరవం,తాటికొండ బ్రహ్మచారి సుమారు 35 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా,విద్యాధికారిగా విద్యారంగానికి విశేష సేవలందించారని పేర్కొన్నారు. ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన అనుభవజ్ఞుడైన విద్యావేత్త పదవీ విరమణ సందర్భంగా సన్మానించుకోవడం ఉపాధ్యాయుల బాధ్యతగా భావిస్తున్నామన్నారు.సుదీర్ఘకాలం విద్యారంగానికి అంకితభావంతో సేవలందించిన వారి అనుభవానికి,కృషికి గౌరవం ఇవ్వడం మంచి సాంప్రదాయమని అభిప్రాయపడ్డారు.ఇలాంటి గౌరవప్రదమైన కార్యక్రమాలను రాజకీయాలకు,వ్యక్తిగత వివాదాలకు ముడిపెట్టడం సమంజసం కాదని స్పష్టం చేశారు.వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు ఎలా ప్రచురిస్తారు?సంబంధిత అధికారుల వివరణ తీసుకోకుండా,వాస్తవాలను పూర్తిస్థాయిలో నిర్ధారించుకోకుండానే వార్తలు ప్రచురించడంపై ప్రధానోపాధ్యాయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సంబంధిత సమావేశం నిర్వహణకు ముందే జరిగినట్లుగా వార్తలు ప్రచురించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తామని,అదే సమయంలో వార్తల ప్రచురణలో వాస్తవ నిర్ధారణ, నిష్పాక్షికతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రచురితమైన వార్తలను పునఃపరిశీలించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని సంబంధిత పత్రికా యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు.ఈ ఆరోపణలతో తుల శ్రీనివాస్ మానసిక క్షోభకు గురయ్యారని,వ్యక్తుల గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా వ్యవహరించడం తగదని పేర్కొన్నారు.అన్ని ఉపాధ్యాయ సంఘాల సంపూర్ణ మద్దతు
మరోవైపు తాటికొండ బ్రహ్మచారి,తుల శ్రీనివాస్‌పై వచ్చిన ఆరోపణలను మండలంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు సైతం తీవ్రంగా ఖండించాయి. వారిద్దరికీ సంఘాల తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.ఉపాధ్యాయుల గౌరవం,ఆత్మగౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని,వాస్తవాలు నిర్ధారించకుండా నిరాధార ఆరోపణలు చేయడం తగదని స్పష్టం చేశాయి.మండలంలోని అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం, అన్ని ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ప్రకటించడం ద్వారా సహోద్యోగుల గౌరవం విషయంలో ఉపాధ్యాయుల ఐక్యతను చాటిచెప్పారు. వివాదాలను పెంచడం తమ ఉద్దేశం కాదని,వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం, విద్యారంగానికి సేవలందిస్తున్న వారి గౌరవాన్ని కాపాడటమే తమ లక్ష్యమని ఐక్య ప్రకటనలో స్పష్టం చేశారు.
ఆరోపణలపై ఉపాధ్యాయుల ఐక్య సమరం!
నేరడుగొమ్ము ,30అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ): నేరడుగొమ్ము మండల విద్యాశాఖలో మండల విద్యాధికారి తాటికొండ బ్రహ్మచారి,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తుల శ్రీనివాస్‌పై ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మండల ఉపాధ్యాయ వర్గాలు ఐక్యంగా స్పందించాయి.ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ వారిద్దరికీ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.మండలంలోని అన్ని యాజమాన్యాల


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply