వివిధ విభాగాల్లో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు
గుంటూరు: సెప్టెంబర్ 27 (AYUSH24 News ప్రతినిధి)
గుంటూరులోని విహెచ్ హైస్కూల్లో ఆదివారం నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్ కరాటే, టైక్వాండో పోటీల్లో ఆర్బీ డ్రాగన్స్ షటోకాన్ కరాటే సంస్థకు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో మొత్తం 250 మంది బాలబాలికలు పాల్గొనగా, ఆర్బీ డ్రాగన్స్ షటోకాన్ కరాటే సంస్థ నుంచి 20 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
ఈ పోటీలకు చీఫ్ రెఫరీగా పి. రాంబాబు వ్యవహరించగా, జి. సాయిరాం న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
కటా విభాగంలో బాలుర 8 సంవత్సరాల విభాగంలో ఓ. తేజదీప్, 14 సంవత్సరాల విభాగంలో ఎ. ఈక్షన్ బంగారు పతకాలు సాధించారు. బాలికల 10 సంవత్సరాలలోపు విభాగంలో కె. వాత్సల్య, ఎం. శివ శ్రావణి బంగారు పతకాలు సాధించారు.
కుమిటే విభాగంలో బాలుర 11 సంవత్సరాలలోపు విభాగంలో వై. మితిన్, 14 సంవత్సరాలలోపు విభాగంలో ఎస్డీ అజ్మీర్, 20 సంవత్సరాలలోపు విభాగంలో జి. మహేష్ బంగారు పతకాలు సాధించారు. బాలికల 11 సంవత్సరాలలోపు విభాగంలో కె. చైత్ర బంగారు పతకం సాధించింది.
పతకాలు సాధించిన క్రీడాకారులను సంస్థ ఏపీ ప్రెసిడెంట్ ఓ. శివకృష్ణ, సెక్రటరీ ఎ. రవికుమార్, సత్తెనపల్లి కోచ్ జి. రవి తదితరులు అభినందించారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply