నేరెడుగొమ్ము మండలం:
ఇచ్చిన మాట ప్రకారం యువతకు క్రికెట్ కిట్లు అందజేసిన జాలే బ్రదర్స్ నరసింహారెడ్డి, తిలక్ రెడ్డి గార్లు. నేరెడుగొమ్ము మండలంలోని పెద్దమునిగల్ గ్రామానికి చెందిన శ్రీశ్రీశ్రీ తుల్జాభవాని యూత్ అసోసియేషన్, స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్లకు క్రికెట్ కిట్లను అందజేసి, అసోసియేషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రెండు అసోసియేషన్ల సభ్యులు మాట్లాడుతూ.. తమ అభ్యర్థనను వెంటనే స్వీకరించి, మంచి మనసుతో క్రికెట్ కిట్లు అందజేసిన జాలే నరసింహారెడ్డి, తిలక్ రెడ్డి గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి సేవలను కొనియాడుతూ, వారిపై, వారి కుటుంబ సభ్యులపై ఆ అంబాభవాని అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కేతావత్ అంబాలి రవి, వినయ్, సురేష్, శేషుతో పాటు గ్రామ నాయకులు, యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Ayush 24 News
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జాలే బ్రదర్స్.. యువతకు క్రికెట్ కిట్ల పంపిణీ
నేరెడుగొమ్ము మండలం: ఇచ్చిన మాట ప్రకారం యువతకు క్రికెట్ కిట్లు అందజేసిన జాలే బ్రదర్స్ నరసింహారెడ్డి, తిలక్ రెడ్డి గార్లు. నేరెడుగొమ్ము మండలంలోని పెద్దమునిగల్ గ్రామానికి చెందిన శ్రీశ్రీశ్రీ తుల్జాభవాని యూత్ అసోసియేషన్, స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్లకు క్రికెట్ కిట్లను అందజేసి, అసోసియేషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply