9వ తెలంగాణ ఉద్యమకారుల వార్షికోత్సవ సభకు ఉద్యమకారులు తరలిరావాలి: మంథని సాయికుమార్
మంథని, సెప్టెంబర్ 23 (ప్రతినిధి):
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ నెల 27న ఆదివారం యాదగిరిగుట్టలో నిర్వహించనున్న 9వ తెలంగాణ ఉద్యమకారుల వార్షికోత్సవ సభకు మంథని నియోజకవర్గంలోని తెలంగాణ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మంథని విజయ్ కుమార్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు మంథని సాయికుమార్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సాయికుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో నిర్వహిస్తున్న వార్షికోత్సవ సభను విజయవంతం చేయడానికి ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు హాజరు కావాలని కోరారు.
అలాగే సభకు హాజరయ్యే ప్రతి ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమ కాలంలో తాను నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన ఉద్యమ డేటాను వెంట తీసుకురావాలని సూచించారు.
ఈ నెల 27న ఆదివారం ఉదయం 11 గంటలకు యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జిట్టా బాలకృష్ణారెడ్డి ప్రాంగణంలో 9వ తెలంగాణ ఉద్యమకారుల వార్షికోత్సవ సభ ప్రారంభమవుతుందని సాయికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.










Leave a Reply