ఎమ్మెల్యే బాలునాయక్ ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి
పట్టభద్రుల ఓటరు నమోదు, పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే
ఉమ్మడి నల్లగొండఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ్‌రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టి, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ వచ్చేలా సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు, పార్టీ ఆదేశాల మేరకు పట్టభద్రుల ఓటరు నమోదు పెంచేందుకు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి గారి విజయానికి శ్రేణులతో కలిసి దేవరకొండ నియోజకవర్గం నుంచి అధిక మెజారిటీ వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పట్టభద్రుల ఓటర్లను నమోదు చేయించాలని సూచించారు











Leave a Reply