మోదీ జన్మదిన సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆలయ పరిసరాల శుభ్రత
దేవరకొండ, 1 (ఆయుష్ 24 న్యూస్ ప్రతినిధి): ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా గురువారం దేవరకొండ పట్టణంలోని తుల్చమ్మ కుంట శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు.
బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్ సూచన మేరకు దేవరకొండ మండల అధ్యక్షుడు ఎర్ర యాదగిరి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు.
ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకురి నరసింహ మాట్లాడుతూ.. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. స్వచ్ఛమైన సమాజం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్రం ఉదయ్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకుడు గుండాల అంజయ్య, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణదాసు చండీశ్వర్, దేవరకొండ రూరల్ మండల అధ్యక్షుడు నేనావత్ రాము నాయక్, నేరేడుగోము మండల అధ్యక్షుడు నాగిళ్ళ అంజి, రెడ్డి శంకర్, గంజి హరి, జూలూరు శీను, జయరామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply