Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › కరీంనగర్‌లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
బ్రేకింగ్ న్యూస్

కరీంనగర్‌లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

కరీంనగర్ జిల్లా కేంద్రంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారన్న సమాచారంతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 168 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. డివిజన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్,

11:21 ఉదయం AM

కరీంనగర్ జిల్లా కేంద్రంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారన్న సమాచారంతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 168 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
డివిజన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సంతోష్ ఆదేశాల మేరకు డీటీఎఫ్ కరీంనగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. దుర్గాభవాని ఆధ్వర్యంలో అధికారులు టవర్ సర్కిల్‌లోని లేబర్ అడ్డా వద్ద తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన లింగంపల్లి నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 168 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకోగా, వాటి మొత్తం బరువు 908 గ్రాములుగా గుర్తించారు. అనంతరం స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలతో పాటు నిందితుడిని కరీంనగర్ అర్బన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దుర్గాభవాని మాట్లాడుతూ, గంజాయి విక్రయించడం, సరఫరా చేయడం, నిల్వ ఉంచడం చట్టవిరుద్ధమని తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు సహకరించాలని, గంజాయి సంబంధిత సమాచారం తెలిస్తే వెంటనే ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలియజేయాలని కోరారు.
— ఆయుష్ 24 న్యూస్
ది వాయిస్ ఆఫ్ ట్రూత్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 11🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App