దేవరకొండ: దేవరకొండ మండలం ఇద్దంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇటికాల వెంకట్ రెడ్డి గారు మృతి చెందిన విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు వారి స్వగ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఇటికాల వెంకట్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకొని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఇటికాల వెంకట్ రెడ్డి గారు చేసిన సేవలు మరువలేనివని, పార్టీ బలోపేతానికి సీనియర్ నాయకుడిగా ఆయన అందించిన సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ఆయన మరణం పార్టీకి, గ్రామానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు.
కష్టకాలంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో మల్రెడ్డి శ్రీలత రవీందర్ రెడ్డి, పేర్ల సతీష్, రంగారెడ్డి, మేరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కర్ణకంటి చిన్నజంగాచారి, దొంతినేని వెంకటేశ్వరరావు, ముచ్చర్ల గిరి, నల్లవెల్లి సదానందం, డ్రైవర్ రాములు, ముదిగొండ నర్సింహా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Ayush 24 News
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇటికాల వెంకట్ రెడ్డి మృతి పట్ల ఎమ్మెల్యే బాలు నాయక్ సంతాపం
దేవరకొండ: దేవరకొండ మండలం ఇద్దంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇటికాల వెంకట్ రెడ్డి గారు మృతి చెందిన విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు వారి స్వగ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఇటికాల వెంకట్


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply