Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులు, గోదావరి పుష్కరాల ఏర్పాట్లను వేగవంతం చేయాలి: మంత్రి శ్రీధర్‌బాబు
బ్రేకింగ్ న్యూస్

కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులు, గోదావరి పుష్కరాల ఏర్పాట్లను వేగవంతం చేయాలి: మంత్రి శ్రీధర్‌బాబు

03:05 తెల్లవారుజాము AM

వచ్చే ఏప్రిల్‌ నాటికి పనులు పూర్తి చేయాలి

కాళేశ్వరం, సెప్టెంబర్ 22 (ప్రతినిధి):

శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులతో పాటు గోదావరి పుష్కరాల ఏర్పాట్లను వేగవంతం చేసి వచ్చే ఏప్రిల్‌ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు.

మంగళవారం కాళేశ్వరంలోని దేవస్థానం ఈవో కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, అటవీ, దేవాదాయ, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో మంత్రి శ్రీధర్‌బాబు సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.200 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఇప్పటికే ప్రారంభమైన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, ఎక్కడా రాజీపడరాదని స్పష్టం చేశారు. దేవుడి నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.1,000 కోట్ల అంచనా వ్యయంతో గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తెలిపారు. కాళేశ్వరం క్షేత్రానికి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని పుష్కరాల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.

అభివృద్ధి పనులకు అవసరమైన మట్టి సేకరణతో పాటు ఇతర అనుమతుల ప్రక్రియను అటవీ శాఖ అధికారులు సమన్వయంతో వేగవంతం చేయాలని కోరారు. పనుల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఇంజినీరింగ్ అధికారులు కాళేశ్వరంలోనే ఉంటూ పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. పనుల పురోగతిని కాటారం సబ్‌ కలెక్టర్‌ గౌరవ్‌ శర్మ ఎప్పటికప్పుడు పరిశీలించి, అవసరమైన సమన్వయం చేయాలని సూచించారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేసి కాళేశ్వరం క్షేత్ర ప్రాశస్త్యాన్ని మరింత పెంచాలని మంత్రి శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు.

అంతకుముందు మంత్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఈవో కార్యాలయంలో వివిధ శాఖల ద్వారా చేపట్టనున్న పనులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.

ఈ సమావేశంలో దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ధార్మిక సలహాదారు గోవింద హరి, అటవీశాఖ అధికారి కిష్టా గౌడ్, కాటారం సబ్‌ కలెక్టర్ సౌరవ్ శర్మ, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఉపాధిహామీ పథకం రాష్ట్ర డైరెక్టర్ దండు రమేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజాబాబు, దేవాలయ శిల్పి స్థపతి బాలసుబ్రహ్మణ్యం, దేవాలయ చైర్మన్ మోహన్ శర్మ, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పంతగాని తిరుమల, సింగిల్ విండో చైర్మన్ తిరుపతి రెడ్డి, దేవస్థానం డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, దేవాదాయ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు, ఆర్కిటెక్చర్ సూర్యనారాయణ మూర్తి, సర్పంచ్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ ప్రకారం, కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి 2026 ఏప్రిల్‌లో రూ.198 కోట్ల అంచనా వ్యయంతో పనులకు శంకుస్థాపన జరిగింది. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో గోదావరి తీరంలోని ఆలయాల అభివృద్ధిని ప్రభుత్వం ప్రణాళికలో భాగంగా పేర్కొంది. (telangana.gov.in)

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 12🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
672 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App