విజయ మణికంఠ డైరీలో కిలో రూ.120.. అరకిలో రూ.60
దేవరకొండ, 1 (ఆయుష్ 24 న్యూస్ ప్రతినిధి): దేవరకొండ పట్టణంలో మీనాక్షి హోటల్ పక్కన ఉన్న విజయ మణికంఠ డైరీలో కుండతో సహా పెరుగు విక్రయాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు యజమాని నిడమనూరి నాగేశ్వరరావు తెలిపారు. కిలో పెరుగు కుండతో కలిపి రూ.120, అరకిలో పెరుగు కుండతో కలిపి రూ.60కు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
గేదె పాలను మట్టి కుండల్లో తోడు పెట్టి పెరుగును తయారు చేస్తున్నామని ఆయన వివరించారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కిలో, అరకిలో పరిమాణాల్లో కుండలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
కుండ పెరుగును ఇష్టపడే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ విధానాన్ని ప్రవేశపెట్టామని నాగేశ్వరరావు చెప్పారు. తయారీలో పరిశుభ్రత, నాణ్యత, రుచికి ప్రాధాన్యం ఇస్తున్నామని, వినియోగదారుల ఆదరణతో విక్రయాలను మరింత విస్తరించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సౌకర్యాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.










Leave a Reply