చింతపల్లి: మండలంలోని ప్రశాంతపురి తండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్య నాయక్ సోదరుడు కేతావత్ చంద్రు మృతి చెందడం తీవ్ర బాధాకరమని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. కేతావత్ చంద్రు మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. కేతావత్ చంద్రు మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, మృతుడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని ఆకాంక్షించారు. కేతావత్ చంద్రు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, చింతపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని సంతాపం తెలిపారు.
– Ayush 24 News
కేతావత్ చంద్రు మృతి బాధాకరం మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
చింతపల్లి: మండలంలోని ప్రశాంతపురి తండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్య నాయక్ సోదరుడు కేతావత్ చంద్రు మృతి చెందడం తీవ్ర బాధాకరమని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. కేతావత్ చంద్రు మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply