కొండ భీమనపల్లి గ్రామంలో ఘనంగా పోషణ మాసం ముగింపు వేడుకలు
విజేత. దేవరకొండ
పోషణ మాసం అవగాహన కల్పించడం కోసం గురువారం రోజున పోషణ మాసం కార్యక్రమాన్ని ఐసీడీఎస్ సి డి పి ఓ చంద్రకళ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పోషకాహారంపై ప్రత్యేక అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ కిశోర బాలికల్లో, గర్భిణీ స్త్రీలు ఐరన్ రక్తహీనత లోపం రాకుండా ఉండాలంటే నిత్యం రాగిజావ, బెల్లం, పల్లీలు, ఆకుకూరలు మరియు సీజనల్ పండ్లను ఆహారంగా తీసుకోవాలని సూచించారు. ఆకుకూరలు, కూరగాయల్లో ఐరన్ అధికంగా ఉంటుందని, అలాగే పప్పుధాన్యాల ద్వారా శరీరానికి కావలసిన మాంసకృత్తులు ప్రోటీన్లు లభిస్తాయని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, పిల్లల ఆరోగ్యం మెరుగుపడటం కోసం ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ నిరంతరం కృషి చేస్తోందని అన్నారు,అంగన్వాడీ టీచర్స్, ఆయా లు గ్రామాలలో మంచి సేవలను అందిస్తున్నారు కొని ఆడినారు, పిహెచ్సి డాక్టర్ తరుణ్ శిశువుల ఆరోగ్య పరిస్థితిని , గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నాము అని తెలిపినారు, ఎంపీడీవో పార్వతి అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు చిన్నారులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు తెలిపారు. అనంతరము ప్రతిజ్ఞ చేయడం జరిగింది సబ్ కలెక్టర్ ఫుడ్ స్టాల్ ను తిలకించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొండ్రెడ్డి శ్రీను, ఉప సర్పంచ్, ఐసిడిఎస్ సూపర్వైజర్స్ రాధ చిట్టెమ్మ, విజయలక్ష్మి, హెల్త్ సూపర్వైజర్ సఫియా , అంగన్వాడీ టీచర్స్ ,పాఠశాల ఉపాధ్యాయులు, ఏఎన్ఎం , ఆశా,గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు,తల్లులు, బాలికలు పాల్గొన్నారు










Leave a Reply