దశదిన కర్మ నిర్వహణకు రూ.5 వేల ఆర్థిక సహాయం
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా
గంగారం, అక్టోబర్ 23, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
గంగారం గ్రామంలో ఇటీవల మృతి చెందిన కొర్స రాణి కుటుంబ సభ్యులను ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం ఉమా సురేందర్ శుక్రవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా కొర్స రాణి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు.
దశదిన కర్మకు రూ.5 వేల ఆర్థిక సహాయం
కొర్స రాణి దశదిన కర్మ నిర్వహణ కోసం కుటుంబ సభ్యులకు రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.
బాధిత కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సహాయం అందించినట్లు తెలిపారు. ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
పరామర్శలో పాల్గొన్న గ్రామ సర్పంచ్
ఈ కార్యక్రమంలో గంగారం గ్రామ సర్పంచ్ ఇరప రుక్మిణి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కొర్స రాణి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసి పరామర్శించారు.
AYUSH24 NEWS | The Voice of Truth









Leave a Reply