దేవరకొండ: కోర్టు విచారణకు వరుసగా గైర్హాజరవుతూ తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని దేవరకొండ ఎక్సైజ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా గుండ్లపల్లి మండలం కుందేల్బాయి తండాకు చెందిన కత్రావత్ బాలు (తండ్రి హర్య)పై 2021లో గుడుంబా తయారీకి సంబంధించి దేవరకొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ పూర్తయి, తుది వాదనలు, తీర్పు దశకు చేరుకుంది.
అయితే, నిందితుడు కోర్టు వాయిదాలకు వరుసగా 10 సార్లు గైర్హాజరయ్యాడు. దీంతో దేవరకొండ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
కోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఎక్సైజ్ ప్రత్యేక బృందం మంగళవారం (అక్టోబర్ 13) కత్రావత్ బాలును అరెస్ట్ చేసింది. ఈ సందర్భంగా అక్రమ మద్యం తయారీ కోసం నిల్వ ఉంచిన నల్లబెల్లాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం నిందితుడిని దేవరకొండ కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ఎక్సైజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) వెల్లడించారు.
— Ayush 24 News
కోర్టుకు వరుసగా 10 సార్లు గైర్హాజరు.. నిందితుడి అరెస్ట్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు తరలింపు
దేవరకొండ: కోర్టు విచారణకు వరుసగా గైర్హాజరవుతూ తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని దేవరకొండ ఎక్సైజ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా గుండ్లపల్లి మండలం కుందేల్బాయి తండాకు చెందిన కత్రావత్ బాలు (తండ్రి హర్య)పై 2021లో గుడుంబా తయారీకి


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply