గణేశుడి సన్నిధిలో 18 మంది విద్యార్థుల కూచిపూడి ప్రదర్శన
బీరంగూడ: సెప్టెంబర్ 25 (AYUSH24 News ప్రతినిధి)
గణేష్ నవరాత్రి ఉత్సవాల చివరి రోజు సందర్భంగా హైదరాబాద్ బీరంగూడలోని పటేల్‌గూడ గడ్డ గణపతి ఆలయంలో శ్రీ నాట్యాలయ అకాడమీకి చెందిన 18 మంది విద్యార్థులు కూచిపూడి నృత్య సేవ నిర్వహించారు. గణేశుడి సన్నిధిలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాన్ని ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అభినందించారు.
నృత్య ప్రదర్శనలో ఆద్య, అన్షు, అద్విక, అన్విక, చక్రిణి, లక్షిత, ప్రహాసశ్రీ, రేణు, రిషిత, యాటిక, వైష్ణవి, సుశాస్విక, నందన, ప్రసన్న, ప్రశాంతి, చిన్మయి, పల్లవి, దేవిక పాల్గొన్నారు.
శ్రీ నాట్యాలయ అకాడమీని గురు మౌనిక మహాలక్ష్మి నిర్వహిస్తున్నారు. ఆమె విజయనగరానికి చెందిన దివంగత గురు రవికుమార్ యాదవ్ వద్ద కూచిపూడి అభ్యసించారు. ప్రస్తుతం బీరంగూడలోని బీహెచ్ఈఎల్ మెట్రో ఎన్‌క్లేవ్‌లో వివిధ వయసుల విద్యార్థులకు శాస్త్రీయ నృత్యంలో శిక్షణ అందిస్తున్నారు.

ఈ సందర్భంగా గురు మౌనిక మహాలక్ష్మి మాట్లాడుతూ గడ్డ గణపతి ఆలయంలో నృత్య సేవ చేసే అవకాశం తమ విద్యార్థులకు లభించడం ఆశీర్వాదంగా భావిస్తున్నామని తెలిపారు. నృత్యం కేవలం ఒక కళ మాత్రమే కాకుండా భక్తికి ఒక రూపమని పేర్కొన్నారు.
శాస్త్రీయ సంస్కృతిని ప్రోత్సహిస్తూ నృత్య సేవ నిర్వహించిన శ్రీ నాట్యాలయ అకాడమీ విద్యార్థులను ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అభినందించారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply