గాంధీ బజారులో ప్రత్యేక వేదిక ఏర్పాటు
పూలవర్షంతో గణనాథులకు స్వాగతం పలుకుతున్న నిర్వాహకులు
దేవరకొండ, సెప్టెంబర్ 23 (ప్రతినిధి): గణేష్ శోభయాత్రలో నిమజ్జనానికి తరలివెళ్తున్న గణనాథులకు ఘన స్వాగతం పలికేందుకు దేవరకొండ పట్టణంలోని గాంధీ బజారులో బుధవారం నీల రవికుమార్ నేతృత్వంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు.
గత కొన్నేళ్లుగా గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గాంధీ బజారులో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శోభయాత్రలో భాగంగా వేదిక మీదుగా తరలివచ్చే గణనాథులకు పూలు జల్లుతూ ఘన స్వాగతం పలకడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
వేదిక వద్దకు చేరుకున్న వినాయక మండపాల నిర్వాహకులను వేదికపైకి ఆహ్వానించి, వారి చేతుల మీదుగా గణనాథుడిపై పూలవర్షం కురిపిస్తున్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం శోభయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఈ సందర్భంగా నిర్వాహకుడు నీల రవికుమార్ మాట్లాడుతూ, నవరాత్రుల పాటు భక్తుల పూజలందుకున్న గణనాథులను నిమజ్జనానికి సాగనంపే సమయంలో ఘనంగా స్వాగతించి, భక్తిపూర్వకంగా వీడ్కోలు పలకాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమానికి భక్తులు, పట్టణ ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు.
ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని వీక్షించేందుకు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, నిర్వాహకుల ప్రయత్నాన్ని అభినందించారు.
అయుష్ 24 న్యూస్










Leave a Reply