దేవరకొండ, సెప్టెంబర్ 18 (ప్రతినిధి): దేవరకొండ పట్టణానికి చెందిన గాజుల రాజేష్ కుమారుడు కీర్తిశేషులు గాజుల అభినయ్ రాజ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం గాజుల రాజేష్ దంపతులతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా కీర్తిశేషులు గాజుల అభినయ్ రాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
గాజుల రాజేష్ కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆకాంక్షించారు. కుటుంబానికి తాను అండగా ఉంటానని, అవసరమైన సమయంలో సహకారం అందిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ పట్టణ ప్రముఖులు, నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
— AYUSH 24 NEWS
The Voice of Truth










Leave a Reply