వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక అందజేసిన ఆసుపత్రి యాజమాన్యం
పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కారం
దేవరకొండ, అక్టోబర్ 28, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
మాల్ పట్టణంలోని స్టార్ లైఫ్ హాస్పిటల్ వార్షికోత్సవ వేడుకలకు హాజరుకావాల్సిందిగా దేవరకొండ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు **వడ్త్య రమేష్**ను ఆసుపత్రి యాజమాన్యం ఆహ్వానించింది.
ఈ సందర్భంగా స్టార్ లైఫ్ హాస్పిటల్ యాజమాన్య ప్రతినిధులు వడ్త్య రమేష్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసుపత్రి వార్షికోత్సవ వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేసి, కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.
అనంతరం వడ్త్య రమేష్‌కు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో స్టార్ లైఫ్ హాస్పిటల్ యాజమాన్య ప్రతినిధులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.










Leave a Reply