తెలంగాణలో జాతీయ రహదారి ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక చర్చ
ఎక్తానగర్, అక్టోబర్ 05, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
గుజరాత్‌లోని ఎక్తానగర్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాంగణంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఛైర్మన్ సంతోష్ యాదవ్‌తో తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
తెలంగాణలో చేపడుతున్న జాతీయ రహదారి ప్రాజెక్టుల పురోగతిపై ఈ సందర్భంగా చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన రహదారి ప్రాజెక్టుల అంశాలను మంత్రి NHAI ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన అక్టోబర్ 5, 6 తేదీల్లో ఎక్తానగర్‌లో నిర్వహించనున్న చింతన్ శివిర్–2026లో పాల్గొనేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర అధికారుల బృందం గుజరాత్ చేరుకుంది.
NHAI ఛైర్మన్‌తో జరిగిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు ఆర్ అండ్ బి స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ పాల్గొన్నారు.










Leave a Reply