- మైనంపల్లి సర్పంచ్ కొర్ర రామ్‌సింగ్ నాయక్ ఆధ్వర్యంలో కార్మికులకు దుస్తుల అందజేత
- దసరా పండుగ ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపాలి: సర్పంచ్ కొర్ర రామ్‌సింగ్
దేవరకొండ, అక్టోబర్ 19, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
దసరా పండుగ ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపాలని, దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో జీవించాలని మైనంపల్లి గ్రామ సర్పంచ్ కొర్ర రామ్‌సింగ్ నాయక్ ఆకాంక్షించారు.
దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం మైనంపల్లి గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మిక సిబ్బందికి సర్పంచ్ కొర్ర రామ్‌సింగ్ నాయక్ దసరా కానుకగా నూతన వస్త్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. నిత్యం గ్రామ ప్రజలకు సేవలందిస్తున్న కార్మికుల కృషిని గుర్తించి, వారి కుటుంబాల్లో పండుగ ఆనందాన్ని నింపాలనే ఉద్దేశంతో నూతన వస్త్రాలను అందజేసినట్లు తెలిపారు.
గ్రామాభివృద్ధిలో కార్మికుల సేవలు అభినందనీయమని, వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ దసరా పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply