7వ వార్డులో నెలకొల్పిన వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు
దేవరకొండ ప్రతినిధి, సెప్టెంబర్ 14 | AYUSH24 NEWS:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని 7వ వార్డు ఎల్ఐసీ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి దేవరకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారుపాకుల సురేష్ గౌడ్, 7వ వార్డు కౌన్సిలర్ హన్మంతు సాయి చంద్ర గౌడ్ హాజరై విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మారుపాకుల సురేష్ గౌడ్ మాట్లాడుతూ.. “అనంత కోటి బ్రహ్మాండ నాయకుడైన విఘ్నేశ్వరుడు సర్వలోక ప్రజలను చల్లగా చూడాలి. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం” అని అన్నారు. ప్రతి శుభకార్యానికి విఘ్నేశ్వరుడిని తొలి పూజగా ఆరాధించడం ఆనవాయితీ అని పేర్కొన్నారు.
ఎల్ఐసీ కాలనీలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో కాలనీ వాసులు బ్రహ్మానంద రెడ్డి, బెజవాడ వెంకటయ్య, పాండు, ఠాకూర్ విష్ణువర్ధన్ రెడ్డి, జవహర్, శ్రీకాంత్, బ్రహ్మచారి, హరి తదితరులు పాల్గొన్నారు.
AYUSH24 NEWS
నిజమైన సమాచారం • నిష్పక్షపాత వార్తలు



Musini.Anjan





Leave a Reply