నేరడుగొమ్ము: గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఆకాంక్షించారు.
సోమవారం నేరడుగొమ్ము మండలం చర్ల తండాలో నిర్వహిస్తున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు రమావత్ రవీంద్ర కుమార్ హాజరై గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదానం మహాదానం అని, భక్తులకు అన్నప్రసాదం అందించడం గొప్ప సేవా కార్యక్రమమని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని గణనాథుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
పండుగలు కేవలం భక్తి, ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా సేవాభావాన్ని, మానవతా విలువలను పెంపొందించేలా ఉండాలని పిలుపునిచ్చారు. మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఉషా దయాకర్ రావుతో పాటు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులను అభినందించారు.
విఘ్నేశ్వరుని ఆశీస్సులతో దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరికీ మంచి జరగాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని రమావత్ రవీంద్ర కుమార్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుమార్, మాజీ PACS చైర్మన్ ముక్కమల్ల బాలయ్య, బొడ్డు గోపాల్ గౌడ్, అరేకంటి రాములు, పల్స వెంకటయ్య, దాసు, అరేకంటి విజయ్, కుంటిగోర్ల నాగరాజు, వడత్య బాలు, బొడ్డుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Ayush 24 News – The Voice of Truth
చర్ల తండాలో మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
నేరడుగొమ్ము: గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఆకాంక్షించారు. సోమవారం నేరడుగొమ్ము మండలం చర్ల తండాలో నిర్వహిస్తున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు రమావత్ రవీంద్ర కుమార్ హాజరై గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply